కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ పుట్టుకతోనే స్పెషల్. సాధారణ నేపథ్యం నుంచే ఇండస్ట్రీకి వచ్చి, నటనతోనే కాదు కార్ రేసింగ్, బైక్ రైడింగ్, ఫోటోగ్రఫీ వంటి పలు రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. ఇటీవలే ఆయన విదాముయార్చి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన సత్తా నిరూపించుకున్నారు. ఇక ఐఐటీ విద్యార్థుల తక్ష డ్రోన్ ప్రాజెక్టుకు సలహాదారుగా వ్యవహరించటం, దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ కార్ రేస్‌లో పాల్గొనడం వంటి విషయాలన్నీ అజిత్ మల్టీ టాలెంటెడ్ వ్యక్తిత్వానికి నిదర్శనాలు.
ఇప్పుడు అజిత్ కుమార్ తనయుడు ఆద్విక్ కూడా అదే దారిలో పయనిస్తున్నాడు. ఇటీవల చెన్నైలోని MIKA గో కార్ట్ సర్క్యూట్‌లో కార్ రేసింగ్ శిక్షణలో పాల్గొన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ఈ వీడియోను షేర్ చేయగా, అందులో అజిత్ తన కొడుకుకు కార్ రేసింగ్‌కు సంబంధించిన ముఖ్యమైన చిట్కాలు ఇస్తూ కనిపించారు. ఆద్విక్ తండ్రి చేతిలో శిక్షణ పొందుతున్న ఈ క్షణాలు అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
ఆద్విక్ ఇప్పటికే స్పోర్ట్స్ రంగంలో తన ప్రతిభను చాటుతున్నాడు. పాఠశాలలో జరిగిన రన్నింగ్ రేస్‌లో గోల్డ్ మెడల్ గెలవడంతో పాటు, బ్రెజిల్ లెజెండ్స్ vs ఇండియా ఆల్‌స్టార్స్ మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లోనూ పాల్గొన్నాడు. బ్రెజిల్ స్టార్ రొనాల్డిన్హో ఆద్విక్‌కు స్పూర్తిగా మారినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కార్ రేసింగ్‌లోనూ అడుగులు వేస్తున్న ఆద్విక్‌పై ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. “తండ్రికి తగ్గ కొడుకు” అని ముచ్చటపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
Ajith & family spotted at MIKA Go Kart Circuit, embracing the need for speed! 🏎️💨 Pure racing passion on display! 🔥
— Suresh Chandra (@SureshChandraa) April 3, 2025
A special thanks to MIKA Madras International Karting Arena & MIC Madras International Circuit.#AjithKumar #MIKAGoKart pic.twitter.com/2s45U06uK6

One thought on “అజిత్ కుమార్ శిక్షణలో కొడుకు అద్విక్.. వైరల్ అవుతోన్న కార్ రేసింగ్ వీడియో”
Comments are closed.