పృథ్వీరాజ్ సుకుమారన్ వివాదం: తల్లి ఆవేదన

Prithviraj Sukumaran L2 Empuran controversy

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఎల్ 2 : ఎంపురాన్‌ సినిమా ఇటీవల విడుదలై రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ సినిమా హిందుత్వంపై తన వైఖరిని ప్రదర్శించిందని, ఇందులోని సన్నివేశాలు ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, హిందుత్వ వ్యతిరేకమైన సన్నివేశాలను తొలగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ వివాదంపై పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ స్పందించకపోయినా, ఆయన తల్లి మల్లిక ఈ విషయమై సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. తన కొడుకు ఎల్ 2 సినిమా విషయంలో తప్పుగా నిందితుడిగా మార్చబడుతున్నారని, తల్లిగా ఆమెకు గాఢ ఆవేదన కలిగిందని మల్లిక వ్యాఖ్యానించారు. సినిమా విషయంలో బాధ్యత ప్రతి ఒక్కరి వుంది. స్క్రిప్ట్ ఫైనల్ చేసే సమయంలో దర్శకుడితో పాటు అందరూ భాగస్వాములుగా ఉంటారని, ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం వారి ఆమోదంతోనే జరిగిందని ఆమె చెప్పారు.

మల్లిక తన పోస్ట్‌లో, కొందరు “మొత్తం తప్పు ఒక్కడిదే” అని నిరాశక్తంగా విమర్శలు చేస్తుండడాన్ని తల్లిగా బాధపడ్డారని వెల్లడించారు. ఎల్ 2 సినిమా ద్వారా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎవరూ వ్యక్తిగతంగా మనోభావాలను దెబ్బతీయడానికి ప్రయత్నించలేదని ఆమె స్పష్టం చేశారు. కానీ, సినిమాలో విలన్ పాత్రను హిందుత్వ ఉగ్రవాదిగా చూపడం, జాతీయ స్థాయిలో కీలక రాజకీయ నాయకుడిగా చూపించడం విమర్శలకు కారణమైంది. ఈ వివాదం చివరకు ఎటు దారి తీస్తుందో చూడాలి.

Read More

One thought on “పృథ్వీరాజ్ సుకుమారన్ వివాదం: తల్లి ఆవేదన

Comments are closed.