జగన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

ys jagan

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అక్రమాస్తుల కేసుల్లో భాగంగా వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై నమోదైన కేసు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా సీబీఐ వాదనలను న్యాయస్థానం సమర్థించింది. వాన్‌పిక్ తరఫున వేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. వాన్‌పిక్ ఓడరేవు కోసం భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, quid pro quo ఆరోపణలు ఉన్నాయని సీబీఐ కోర్టుకు వివరించింది. అలాగే వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోనే భూసేకరణ జరిగిందని కూడా సీబీఐ స్పష్టం చేసింది.

దీంతో వాన్‌పిక్ కేసులో జగన్‌కు చట్టపరమైన ఇబ్బందులు కొనసాగుతున్నాయి.

Read More : ఏపీ పట్టణాల్లో చెత్త సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కసరత్తు.

One thought on “జగన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

Comments are closed.