ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు

ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఖొండాబ్ అణు పరిశోధనా కేంద్రం సమీప ప్రాంతంపై దాడులు నిర్వహించినట్లు సమాచారం. అయితే ఈ దాడికి ముందే కేంద్రాన్ని ఖాళీ చేసినట్లు అధికారులు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో రేడియేషన్ ప్రమాదం లేదని పేర్కొన్నారు.

అలాగే ఇరాన్‌లోని ప్రముఖ అణు కేంద్రంగా గుర్తింపు పొందిన ఇస్ఫహాన్ నగరంలో కూడా శుక్రవారం ఉదయం పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ ఘటనలపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) స్పందిస్తూ, మధ్య ఇరాన్‌లో ఉన్న క్షిపణి ప్రయోగ స్థావరాలు, ఆయుధ నిల్వలపై తమ యుద్ధ విమానాలు దాడులు చేసినట్టు ధ్రువీకరించాయి.

అంతేకాకుండా, ఇరాన్ నుంచి ప్రయోగించిన 15కిపైగా డ్రోన్లను సకాలంలో గుర్తించి ఆపినట్లు ఇజ్రాయెల్ సైనిక వర్గాలు తెలిపాయి. తాజా దాడులతో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.

Read More : ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు – 639 మంది మృతి

One thought on “ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు

Comments are closed.