జూలై 24: పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమా విడుదల తేదీపై చివరికి ఉత్కంఠకు తెరపడింది. ఈ భారీ చారిత్రక యాక్షన్ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఇంతకుముందు ఈ సినిమా జూలై 12న విడుదల కావాల్సి ఉండగా, అనివార్య కారణాలతో వాయిదా పడింది. అయితే ఇప్పుడు విడుదల తేదీ ఖరారవడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది.

ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ చారిత్రక యోధుడి పాత్రలో కొత్త రూపంలో అలరించనున్నారు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్‌కి, పవన్ రాజకీయాలు, ఇతర షెడ్యూల్‌ల కారణంగా ఆలస్యం సంభవించింది. ప్రస్తుతానికి ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చేపట్టారు.

సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో నిర్మాతపై ఆర్థిక భారం పడిందని భావించిన పవన్, తన పారితోషికాన్ని స్వయంగా వెనక్కి ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా, బిజీ షెడ్యూల్ మధ్యలోనూ ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయించి, రాత్రి 10 గంటలకు డబ్బింగ్ మొదలుపెట్టి నాలుగు గంటల్లో పూర్తి చేశారని చిత్ర వర్గాలు వెల్లడించాయి.

ఈ సినిమాలోని హైలైట్ సన్నివేశాలలో ఒకటైన ‘అసుర హననం’ పాట ఫైట్‌ సీన్‌ ను పవన్ కల్యాణే స్వయంగా డిజైన్ చేసినట్టు దర్శకుడు జ్యోతికృష్ణ తెలిపారు. ఈ పాత్ర కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు.

Read More : ధనుష్, నాగార్జునల ‘కుబేరా’కి అద్భుత స్పందన

One thought on “జూలై 24: పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం

Comments are closed.