వృద్ధ మహిళపై గొడ్డలితో దాడి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దేవరంపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలిపై దారుణంగా గొడ్డలితో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికంగా నివసిస్తున్న లక్ష్మీ అనే మహిళపై, వరుసకు కొడుకైన మారుపాక అంజి అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే… గతంలో భూ తగాదా నేపథ్యంలో అంజి తండ్రి మారుపాక సారయ్య హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై మౌనం వీడిన అంజి, కోపంతో గురువారం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న లక్ష్మీపై ఊహించని విధంగా గొడ్డలితో దాడి చేశాడు.

దాడిలో లక్ష్మీ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే ఆమెను భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More : బుధవారం 4 ప్రాంతాల్లో మేజర్ భద్రతా విన్యాసం