మోదీ హాజరుతో భారీ ఏర్పాట్లు

జూన్ 21న విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. “Yoga for One Earth, One Health” నినాదంతో ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది.

విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సమీక్ష నిర్వహించి సంబంధిత శాఖలతో చర్చించారు. విద్యార్థులు, యోగా శిక్షకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి దాదాపు రెండు లక్షల మంది ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈశా ఫౌండేషన్ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబును నోడల్ అధికారిగా నియమించారు.

ఇవేంట్ నిర్వహణ, వేదిక ఎంపికపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి యోగా మ్యాట్లు, టీషర్టులు పంపిణీ చేయనున్నారు.

Read More : విజయవాడకు తీసుకొచ్చిన పోలీసుల ప్రత్యేక బృందం.

One thought on “మోదీ హాజరుతో భారీ ఏర్పాట్లు

Comments are closed.