అనంతపురం జిల్లాలో మూడు రోజుల పర్యటనకు

మంత్రి నారా లోకేష్ : శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జేఎన్టీయూ స్నాతకోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని, అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు.

గుర్తించదగ్గ విషయం ఏమంటే, రూ. 22 వేల కోట్ల వ్యయంతో గుంతకల్లు నియోజకవర్గంలోని బేతపల్లి ప్రాంతంలో నిర్మాణం కానున్న ఈ రీన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రారంభంపై గతంలో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి లోకేష్, రీన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య చర్చలు జరిగినాయి.

ఈ ప్రాజెక్టు తొలి దశలో 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి యూనిట్లకు రూ.7 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. భవిష్యత్‌లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2వేల మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ స్టోరేజి యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

2019కి ముందు రీన్యూ పవర్ రాష్ట్రంలో 777 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రధాన పెట్టుబడిదారుగా ఉంది. వచ్చే ఐదేళ్లలో 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకురావడం లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పని చేస్తున్నారు.

Read More : మోదీ హాజరుతో భారీ ఏర్పాట్లు

One thought on “అనంతపురం జిల్లాలో మూడు రోజుల పర్యటనకు

Comments are closed.