గోవా నుంచి లక్నోకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఎయిర్ టర్బులెన్స్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం గాల్లో ఊగిసలాడడంతో కొంతసేపు ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. విమానంలో ఉన్న ఓ జర్నలిస్టు, ఘటనాస్థితిని సెల్ఫీ వీడియో ద్వారా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
విమాన సిబ్బంది అప్రమత్తంగా స్పందించడంతో ప్రమాదం తప్పింది. అనంతరం విమానం లక్నో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఇండిగో అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ఈ సంఘటన ప్రయాణికుల్లో కలకలం సృష్టించినా, విమాన సిబ్బంది చురుకైన చర్యతో పెద్ద ప్రమాదం జరగకుండా నిలువరించగలిగారు.
Read More : అహ్మదాబాద్ – లండన్ : విమాన సర్వీస్ రద్దు

2 thoughts on “ఇండిగో .. ప్రయాణికుల్లో భయాందోళన”
Comments are closed.