గుజరాత్ విమాన ప్రమాదం: విద్యార్థుల దూకుడుపై వీడియో వైరల్

అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై ఎయిరిండియా విమానం కూలిన సమయంలో విద్యార్థులు బాల్కనీల నుంచి దూకుతున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. జూన్ 12వ తేదీన లండన్‌ వెళ్లేందుకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, విమానం హాస్టల్ భవనాన్ని ఢీకొనడంతో మంటలు ఎగసిపడ్డాయి.

వీడియోలో భయభ్రాంతుల్లో ఉన్న విద్యార్థులు బెడ్‌షీట్లు, తాళ్లను ఉపయోగించి భవనం నుంచి కిందికి దూకడం, ఇతరులు నేరుగా ప్రాణాల కోసం గాల్లోకి దూకడం కనిపిస్తోంది. ప్రమాదం సమయంలో హాస్టల్‌లో చాలామంది విద్యార్థులు భోజనం చేస్తుండటంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది.

ఈ ఘోర ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే, హాస్టల్ భవనంలో ఉన్న మరో 33 మంది వైద్య విద్యార్థులు, సిబ్బందులూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరు విషాదంలో మునిగిపోతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతోంది.

Read More : ఇండిగో .. ప్రయాణికుల్లో భయాందోళన