దేశంలో వరుసగా విమానాల్లో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లవలసిన ఎయిరిండియా విమానంలో టేకాఫ్‌కు ముందే సాంకేతిక లోపం తలెత్తింది.
విమాన సిబ్బంది అప్రమత్తతతో సమస్యను గుర్తించడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన సర్వీస్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికులంతా విమానం నుంచి సురక్షితంగా దిగినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయిలో సాంకేతిక పరీక్షలు నిర్వహించి సమస్యను పరిష్కరించిన తరువాతే విమానాన్ని మళ్లీ రవాణా చేయనున్నట్లు విమానయాన సంస్థ తెలిపింది.
ఇటీవల దేశంలోని పలు విమానాల్లో ఈ తరహా సాంకేతిక లోపాలు వెలుగులోకి రావడంతో, విమాన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో విమానయాన సంస్థలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read More : కోల్‌కతాలో ఎయిరిండియా విమానానికి సాంకేతిక లోపం

One thought on “అహ్మదాబాద్ – లండన్ : విమాన సర్వీస్ రద్దు”
Comments are closed.