ఇండియన్ రైల్వేస్: కౌంటర్‌లో కొనుగోలు చేసిన టికెట్లను ఇకపై ఆన్‌లైన్‌లో రద్దు చేసుకునే సౌకర్యం!

ఇండియన్ రైల్వేస్ ప్రయాణీకుల సౌలభ్యం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కౌంటర్‌లో కొనుగోలు చేసిన రిజర్వేషన్ టికెట్లను రద్దు చేసుకోవాలంటే, ప్రయాణికులు స్వయంగా రిజర్వేషన్ కేంద్రాన్ని సందర్శించి రద్దు చేసుకోవాల్సి వచ్చేది. అయితే, తాజా మార్గదర్శకాలు ప్రకారం, ఇకపై కౌంటర్ టికెట్లను IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా 139 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి రద్దు చేసుకోవచ్చు.

అయితే, ఈ ప్రక్రియ ద్వారా టికెట్ రద్దు చేసినప్పటికీ, రిఫండ్ పొందాలంటే ప్రయాణికులు తమ అసలు టికెట్‌తో రిజర్వేషన్ కేంద్రాన్ని తప్పనిసరిగా సందర్శించాలి. టికెట్‌ను సమర్పించిన తర్వాత, రైల్వే అధికారుల ద్వారా రిఫండ్ ప్రాసెసింగ్ జరుగుతుంది.

ఈ కొత్త మార్గదర్శకాలు ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు, టికెట్ రద్దు కోసం స్టేషన్‌కు వెళ్లే అవసరాన్ని తగ్గించేందుకు ఉపయుక్తంగా ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Read More : ఢిల్లీలో ప్రైవేట్ స్కూళ్లకు నిషేధం – విద్యార్థులపై బలవంతపు కొనుగోళ్లపై ఆంక్షలు