భారతదేశానికి స్వంత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం: ఐటీ సంస్థలు ముందుకు వస్తున్నాయి – మంత్రి అశ్విని వైష్ణవ్

IT minister

న్యూఢిల్లీ: భారతదేశం ఈరోజు ఐటీ సేవల రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. కానీ ఇప్పుడిదే సమయం దేశాన్ని ఉత్పత్తి ఆధారిత దేశంగా మార్చాల్సిందని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ముఖ్యంగా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ రంగంలో స్వదేశీ సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి అనుకూలంగా దేశీయ కంపెనీలు అడుగులు వేయాలని ఆయన సూచించారు.

ఈ నేపథ్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro) వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు భారతదేశం కోసం ప్రత్యేకమైన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో గూగుల్‌ ఆండ్రాయిడ్, యాపిల్‌ ఐఓఎస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ monoplyని త్రివించడానికి, స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేయడం కీలకమని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.

“భారతదేశం ఇప్పటి వరకు సాఫ్ట్‌వేర్ సేవల రంగంలో అద్భుతంగా రాణించింది. కానీ ఇప్పుడు సేవల నుంచి ఉత్పత్తుల అభివృద్ధి దిశగా ప్రయాణించాల్సిన సమయం వచ్చింది. ప్రపంచానికి ఒక ప్రత్యామ్నాయంగా నిలిచేలా, ఒక గ్లోబల్ స్టాండర్డ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంపై దేశీయ కంపెనీలు దృష్టి సారించాలి” అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వ సహకారంతో దేశీయ టెక్ దిగ్గజాలు ముందుకు వస్తున్నాయి. భారత్‌ లోనే డిజైన్‌ చేసి అభివృద్ధి చేసే ఓఎస్ (Operating System) ద్వారా భవిష్యత్‌లో డిజిటల్ స్వయంపూర్తి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

Read More

One thought on “భారతదేశానికి స్వంత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం: ఐటీ సంస్థలు ముందుకు వస్తున్నాయి – మంత్రి అశ్విని వైష్ణవ్

Comments are closed.