టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్లో నాలుగో మ్యాచ్ రేపటి నుండి (జూలై 23) ప్రారంభం కానుంది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్, ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ భారత జట్టుకు గట్టి హెచ్చరిక జారీ చేశాడు. స్టోక్స్ మాట్లాడుతూ, “మేము కావాలనే ఎవరినీ రెచ్చగొట్టం. కానీ ఎవరైనా మమ్మల్ని స్లెడ్జింగ్ చేస్తే మాత్రం మేము కూడా జవాబివ్వడానికి సిద్ధంగా ఉంటాం. మైదానంలో మాటల యుద్ధానికి మేము వెనుకాడం” అని పేర్కొన్నాడు. దీంతో నాలుగో టెస్టు మరింత ఆసక్తికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే మూడో టెస్టు సమయంలో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య మాటల తూటాలు పేలిన సంగతి తెలిసిందే. ఆటపై కన్నా మాటల తాకిడే ఎక్కువగా కనిపించిన నేపథ్యంలో నాలుగో టెస్టు మరింత రసవత్తరంగా మారనుంది.
ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరుగనున్న ఈ టెస్టు, సిరీస్ ఫలితంపై కీలకంగా ప్రభావం చూపనుంది. ఉత్కంఠత, ఒత్తిడి మధ్య రెండు జట్లు ఎలా ఆడతాయో, పైచేయి ఎవరిదో చూడాల్సిందే.
Read More : అన్షుల్ ని ఎలా ఎంపిక చేస్తారు..? – సెలెక్టర్లపై ఫైర్

One thought on “టీమిండియాకు బెన్ స్టోక్స్ ఘాటు హెచ్చరిక”
Comments are closed.