వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఇవాళ ఆసీస్‌తో జరిగిన రెండో టీ20తో ఆయన అంతర్జాతీయ ప్రయాణానికి ముగింపు పలికాడు. ఈ మ్యాచ్‌కి ముందు రెండు జట్ల ఆటగాళ్లు రస్సెల్‌కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. తన ఫెయిర్‌వెల్ మ్యాచ్‌లోనూ రస్సెల్ చెలరేగిపోయాడు. కేవలం 15 బంతుల్లోనే 240 స్ట్రైక్‌రేట్‌తో 36 పరుగులు (4 సిక్సర్లు, 2 ఫోర్లు) బాదాడు. వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 172/8 స్కోరు చేసింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి గెలిచింది. రస్సెల్‌కు విజయంతో వీడ్కోలు ఇవ్వాలనుకున్న కరీబియన్ జట్టుకు నిరాశే ఎదురైంది. రస్సెల్ 2019 నుంచి ప్రధానంగా టీ20 ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు. విండీస్ తరఫున మొత్తం 84 టీ20లు ఆడి, 22 సగటుతో 1,078 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. బౌలింగ్‌లో 30.59 సగటుతో 61 వికెట్లు పడగొట్టాడు.
వన్డేల్లో 56 మ్యాచ్‌లు ఆడి, 27.21 సగటుతో 1,034 పరుగులు, 31.84 సగటుతో 70 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతని ఉత్తమ బౌలింగ్ ఫిగర్స్ 4/35. టెస్టుల్లో మాత్రం కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు.
అంతర్జాతీయ మైదానాలతో పాటు, రస్సెల్ వివిధ దేశాల్లోని టాప్ టీ20 లీగ్‌లలోనూ చెరగని ముద్ర వేశాడు. మొత్తం 561 టీ20 మ్యాచ్‌ల్లో 26.39 సగటుతో 9,316 పరుగులు చేశాడు. 168 పైగా స్ట్రైక్‌రేట్ కలిగిన అతను రెండు సెంచరీలు, 33 అర్ధ శతకాలు కూడా బాదాడు. బౌలింగ్‌లోనూ 485 వికెట్లు తీసి అద్భుతాలు సృష్టించాడు.
ఆండ్రే రస్సెల్ క్రికెట్ ప్రపంచానికి చేసిన సేవ చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.
Read More : టీమిండియాకు బెన్ స్టోక్స్ ఘాటు హెచ్చరిక

One thought on “వెస్టిండీస్ వీరుడు రస్సెల్‌కి భావోద్వేగ భరిత వీడ్కోలు”
Comments are closed.