ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కాడు. కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల పేర్లు బయటపెడుతూ వన్‌మాన్ ఆర్మీలా మారిన అన్వేష్, తాజాగా మరో బిగ్ బాస్ బ్యూటీపై సంచలన ఆరోపణలు చేశాడు. ‘నా అన్వేషణ’ పేరిట విడుదల చేసిన తాజా వీడియోలో యాక్ట్రెస్ సిరి హన్మంత్ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీగా డబ్బు సంపాదించిందని, ఆ డబ్బుతో మూడు బ్యూటీ క్లీనిక్స్ ప్రారంభించిందని వెల్లడించాడు.
టిక్‌టాక్ ద్వారా గుర్తింపు పొందిన సిరి, షణ్ముఖ్‌తో చేసిన షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించి, బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొని మంచి గుర్తింపు పొందింది. అయితే షో తర్వాత, నిమిషానికి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ దానితో వచ్చిన డబ్బుతో వ్యాపారాలు మొదలుపెట్టిందని అన్వేష్ ఆరోపించాడు. ఆమె బ్యూటీ క్లీనిక్ ఓపెనింగ్‌కు హాజరైన 30 మంది బెట్టింగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నవారని సంచలన విషయాలను వెల్లడించాడు. ఈ ఆరోపణలు చేయడమే కాదు, వీడియోతో సహా ఆధారాలు చూపించిన అన్వేష్ షేర్ చేసిన కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదితో పాటు మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజపై కూడా అన్వేష్ విమర్శలు గుప్పించాడు. ఆయన ఓ పనికిరాని యూట్యూబ్ ఛానెల్‌తో ప్రారంభం చేసి, ఫిల్మ్ ఇండస్ట్రీతో ఉన్న సంబంధాల వల్ల బిగ్ బాస్ అవకాశాన్ని పొందాడని తెలిపాడు. అనంతరం బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుతో భారీగా షాపులు ఓపెన్ చేశాడని ఆరోపించాడు. సిరి, తేజ పేద కుటుంబాల నుంచి వచ్చారని చెబుతూ.. వాళ్లకు ఈ అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్వేష్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి.
