చెన్నైలో విజయవంతమైన హైడ్రోజన్ రైలు కోచ్ పరీక్ష

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో అత్యాధునిక హైడ్రోజన్‌ శక్తి ఆధారిత రైలు కోచ్‌ను విజయవంతంగా పరీక్షించారు. 1,200 హార్స్‌పవర్ సామర్థ్యంతో రూపొందించిన ఈ ప్రత్యేక కోచ్‌ను స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయడం విశేషం. రైల్వే వర్గాల ప్రకారం, హైడ్రోజన్ ఇంధనంపై నడిచే ఈ కోచ్ పర్యావరణహితంగా ఉండటమే కాకుండా, ఇంధన వ్యయాలను గణనీయంగా తగ్గించగలదని భావిస్తున్నారు.

ఈ విజయవంతమైన పరీక్షతో భారత్ హైడ్రోజన్ రైలు సాంకేతికతలో ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే నెలల్లో ఈ సాంకేతికతను మరిన్ని రైలు కోచ్‌లకు విస్తరించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం.

Read More : థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దులో ఘర్షణలు..

One thought on “చెన్నైలో విజయవంతమైన హైడ్రోజన్ రైలు కోచ్ పరీక్ష

Comments are closed.