విద్యార్థిని తలపై కొట్టిన టీచర్

హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. లిటిల్ ఇండియన్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో ఒక టీచర్ చిన్నారి తలపై టిఫిన్ బాక్స్‌తో కొట్టారు. ఈ దాడిలో చిన్నారి తలకు తీవ్ర గాయమై, రక్తం కారడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నారి తలకు మూడు కుట్లు వేశారు.

ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం, టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More : ముస్లింలకు రిజర్వేషన్లపై సీఎం స్పష్టత ఇవ్వాలి

One thought on “విద్యార్థిని తలపై కొట్టిన టీచర్

Comments are closed.