పాతబస్తీలో కాలువలో పడ్డ కారు

హైదరాబాద్‌లోని పాతబస్తీ, బాబానగర్ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా అదుపుతప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులను స్థానిక ప్రజలు, వాహనదారులు చాకచక్యంగా రక్షించారు.

వేగంగా వస్తున్న కారు రోడ్డుపై ఉన్న నీటి కారణంగా అదుపుతప్పి కాలువలో పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, బాటసారులు వెంటనే స్పందించి అతి కష్టం మీద యువకులను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన యువకులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More : జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలను సన్మానించిన సీఎం

One thought on “పాతబస్తీలో కాలువలో పడ్డ కారు

Comments are closed.