హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోపాల్‌నగర్ వద్ద గ్లోబల్ ఎడ్జ్ స్కూల్‌కు చెందిన బస్సు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నాగరాజ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు నాగరాజ్ క్యాలిసియం హాస్పిటల్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగంగా దూసుకొచ్చిన బస్సు నాగరాజ్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More : పబ్‌కు పిలిచి యువకుడిని కిడ్నాప్ చేసిన బార్ డాన్సర్
