హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం.

హైదరాబాద్ మెట్రో రైల్‌లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. మియాపూర్ నుండి ఎల్బీనగర్ దాకా వెళ్లే ప్రధాన మార్గంలో మెట్రో సేవలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ఈ లోపం వల్ల సుమారు అరగంట పాటు రైళ్లు ఆగిపోయాయి.

ప్రత్యక్షసాక్షుల సమాచారం మేరకు, భారత్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ట్రైన్ దాదాపు 20 నిమిషాలపాటు కదలకుండా నిలిచిపోయింది. దాంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉదయం పీక్స్ అవర్స్‌లో జరిగిన ఈ ఘటన వల్ల ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ఇటీవల కాలంలో హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్యలు తరచూ నమోదవుతున్నాయి. దీనిపై అధికారుల నుంచి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ప్రయాణికుల భద్రత, సమయపాలన విషయంలో మెట్రో యాజమాన్యం మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ తరహా లోపాలు పునరావృతం కాకుండా తగిన మరమ్మతులు, మెయింటెనెన్స్ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Read More : కేంద్రం కులగణన నిర్ణయం – కిషన్ రెడ్డి

One thought on “హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం.

Comments are closed.