హైదరాబాద్ మెట్రో ఛార్జీలలో 10% తగ్గింపు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు సానుకూల వార్త వెల్లడైంది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలపై ప్రయాణికుల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం ఈ విషయంపై పునరాలోచన చేసి కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన చార్జీలను పది శాతం మేర తగ్గిస్తూ సవరణలు చేసింది.

ఇటీవల మే 17న అమల్లోకి వచ్చిన మెట్రో ఛార్జీలు కనిష్టంగా రూ.10 నుంచి రూ.12, గరిష్ఠంగా రూ.60 నుంచి రూ.75కు పెరిగాయి. ఈ ధరలపై 10 శాతం తగ్గింపునిచ్చడంతో ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గనుంది. ఈ సవరించిన కొత్త చార్జీలు మే 24వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు మెట్రో యాజమాన్యం స్పష్టం చేసింది.

నగరంలో వందల వేలకు పైగా ప్రజలు రోజువారీగా మెట్రో సేవలను వినియోగిస్తున్న నేపధ్యంలో, ఈ నిర్ణయం ప్రయాణికులకు ఊరట కలిగించే అవకాశం ఉంది. ప్రయాణ ఖర్చుల పెంపుపై వచ్చిన ఆవేదనలకు ప్రభుత్వం స్పందిస్తూ, మెట్రో సేవలను మరింత ప్రజాప్రియంగా మారుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Read More : మాజీ సీఎం కేసీఆర్‌కి నోటీసులు

One thought on “హైదరాబాద్ మెట్రో ఛార్జీలలో 10% తగ్గింపు

Comments are closed.