హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ క్రెడిట్ కార్డు బిల్లును వసూలు చేసేందుకు వెళ్లిన రికవరీ ఏజెంట్‌పై కుక్కతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఏజెంట్‌కు తీవ్ర గాయాలవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే… జవహర్‌నగర్‌కు చెందిన నందివర్ధన్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ బ్యాంక్ నుండి తీసుకున్న క్రెడిట్ కార్డు ద్వారా సుమారు రెండు లక్షల రూపాయల వరకు బాకీ పడింది. ఆ మొత్తాన్ని వసూలు చేయడానికి బ్యాంక్ తరఫున ఏజెంట్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ నందివర్ధన్ ఇంటికి వెళ్లాడు.
అయితే సత్యనారాయణ వచ్చి బాకీ చెల్లించాల్సిందిగా కోరిన సమయంలో నందివర్ధన్ తీవ్ర ఆగ్రహంతో స్పందించాడు. సాయంత్రం సమయంలో అతను తన ఇంటి వద్ద ఉన్న పెంపుడు కుక్కను ఏజెంట్‌పై వదిలాడు. కుక్క ఒక్కసారిగా దాడికి వెళ్లి సత్యనారాయణపై పడి అతడి చేతిని తీవ్రంగా కరిచింది. గాయాలైన బాధితుడు సమీప హాస్పిటల్‌లో చికిత్స పొందిన అనంతరం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదు ఆధారంగా నందివర్ధన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రికవరీకి వెళ్లిన ఏజెంట్‌పై కుక్కను వదలడం అనేది చట్టవిరుద్ధమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
Read More : గోల్కొండలో తండ్రి చేతులుగా పసికందు హత్య

2 thoughts on “హైదరాబాద్‌లో రికవరీ ఏజెంట్‌పై కుక్కతో దాడి.”
Comments are closed.