హుమైరా అస్గర్ అనుమానాస్పద మృతి

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి, మోడల్ హుమైరా అస్గర్ అలీ (30) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. కరాచీలోని డిఫెన్స్ ప్రాంతంలోని తన నివాసంలో ఆమె మృతదేహంగా కనిపించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా హుమైరా ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే గత మూడు వారాలుగా ఆమె ఎవరినీ కలవలేదు. ఇంతలో ఆమె నివాసం నుంచి బహుశా శవదుర్గంధం రావడంతో పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్నిసార్లు తలుపు తట్టినా ప్రతిస్పందన లేకపోవడంతో, తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా హుమైరా అస్గర్ మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో లభించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా ఇది సహజ మరణంగా కనిపిస్తోందని పోలీసులు వెల్లడించగా, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

హుమైరా అస్గర్ పాకిస్థాన్‌లో ‘తమాషా ఘర్’ అనే రియాలిటీ షోలో పాల్గొనడంతో పాటు, ‘జలైబీ’ అనే చిత్రంలో నటించి ప్రేక్షకుల గుర్తింపు పొందారు. ఆమె అకాల మరణంపై పాక్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

Read More : యాపిల్ కొత్త సీఓఓగా భారత సంతతికి చెందిన సబీ ఖాన్

One thought on “హుమైరా అస్గర్ అనుమానాస్పద మృతి

Comments are closed.