ష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్న వేళ, నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం హన్స గ్రామంలో మాత్రం వేడుకల సందడి కాకుండా ఉద్రిక్తత నెలకొంది. హోలీ పండుగ సందర్భంగా గ్రామస్తులు తమ వింత ఆచారాన్ని పాటించేందుకు సిద్ధమైనప్పటికీ, పోలీసులు ఆ వేడుకలకు బ్రేక్ వేశారు.
గ్రామంలో వింత ఆచారం
హన్స గ్రామంలో వందేళ్లుగా హోలీ సందర్భంగా ప్రత్యేక ఆచారం కొనసాగుతోంది. గ్రామస్తులు ‘పిడుగుద్దులాట’ పేరిట ప్రత్యేక వేడుక నిర్వహిస్తూ వస్తున్నారు. గ్రామంలోని ప్రజల నమ్మకం ప్రకారం, ఈ ఆచారాన్ని పాటించకపోతే గ్రామానికి అరిష్టం తథ్యమని భావిస్తారు.
పోలీసుల ఆంక్షలు – గ్రామస్తుల ఆగ్రహం
అయితే ఈ ఏడాది ఈ ఆచారానికి పోలీసులు అడ్డుకట్ట వేశారు. పిడుగుద్దలాట పేరిట జరిగే వేడుకకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇలా వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో 144 సెక్షన్‌ను అమలు చేశారు.
గ్రామస్తుల నిరసన
గ్రామస్తులు మాత్రం వందేళ్లుగా కొనసాగుతున్న తమ ఆచారాన్ని అడ్డుకోవడం సమంజసం కాదని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతటి అడ్డంకులైనా తమ ఆచారాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.
ఉత్కంఠగా మారిన పరిస్థితి
పోలీసుల ఆంక్షలతో గ్రామస్తులు వెనకడుగు వేస్తారా? లేక తమ ఆచారాన్ని కొనసాగించేందుకు పట్టుదలగా ముందుకు వెళతారా? అనేది ఉత్కంఠగా మారింది.
2 thoughts on “హోలీ వేడుకల్లో ఉద్రిక్తత: నిజామాబాద్ జిల్లా హన్స గ్రామంలో పోలీసుల ఆంక్షలు, గ్రామస్తుల ఆగ్రహం”
Comments are closed.