Himachal : వరదలతో ఊహించని విధ్వంసం

హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన వరుస వర్షాలు, ఆకస్మిక వరదలతో రాష్ట్రం అతలాకుతలమైంది. ప్రాకృతిక విపత్తుతో భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటివరకు వరదలతో మృతి చెందిన వారి సంఖ్య 78కి చేరిందని అధికారులు తెలిపారు. అదేవిధంగా వరదల తాకిడితో 37 మంది గల్లంతైనట్లు సమాచారం. ఈ విపత్తు వల్ల రాష్ట్రానికి సుమారుగా రూ.500 కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా ప్రభుత్వం అంచనా వేసింది. తీవ్ర వర్షాలు, కొండచరియల కూలిసంఘటనలు, రహదారుల దెబ్బతినడం వంటి ఘటనలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సహాయ చర్యలు కొనసాగుతున్నప్పటికీ, పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదని అధికారులు పేర్కొన్నారు.

Read More : పుణె ఐటీ ఉద్యోగిని రేప్ ఫిర్యాదులో షాకింగ్ మలుపు