హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు జిల్లాలో మళ్లీ ప్రకృతి తన కోపాన్ని చాటుకుంది. అక్కడ క్లౌడ్ బరస్ట్ (Cloud Burst) కారణంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతుండగా, పలు రహదారులు కొట్టుకుపోయాయి. దాంతో వాహనాలు నీటిలో మునిగిపోతూ పారిపోతున్న దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి.
ఇంటర్ స్టేట్ రూట్లపైనా ఈ వర్ష ప్రభావం తీవ్రంగా పడింది. ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఈ బీభత్సానికి ఇద్దరు రాష్ట్ర మంత్రులు కూడా చిక్కుకుపోయారు. అధికారిక పర్యటనలో ఉన్న ఆ మంత్రులు గడ్కేరు ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయినట్లు సమాచారం. వారి సిబ్బంది వెంటనే సహాయ చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడి సహాయక దళాలు, పోలీసు బృందాలు అప్రమత్తమై ఉండి పరిస్థితిని క్రమంగా నియంత్రణకు తీసుకువస్తున్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడటమే అధికారులు ప్రాధాన్యతగా తీసుకుంటున్నారు. ప్రజలు అవసరం లేనిపక్షంలో బయటకు రావద్దని అధికార యంత్రాంగం సూచించింది.
ఈ ఘటన మరోసారి హిమాచల్‌లో క్లౌడ్ బర్స్ట్‌లు కలిగించే తీవ్రతను చూపింది. భవిష్యత్తులో మరింత అప్రమత్తంగా ఉండేందుకు వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలపై ప్రజలు దృష్టి పెట్టాలన్న విజ్ఞప్తి చేశారు.
Read More : 275 మంది మృతిచెందిన ఘోర ఘటన

One thought on “కులు జిల్లాలో క్లౌడ్ బరస్ట్‌తో విపరీతమైన వర్షాలు”
Comments are closed.