ముంబై ఎయిర్ ఇండియా విమానంలో పక్షి గూడు కలకలం.

ముంబై నుండి బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. విమానం రెక్కల మధ్య భాగంలో పక్షి గూడు ఉన్నట్టుగా గుర్తించిన ఓ అప్రమత్త ప్రయాణికుడు, దాని ఫోటో తీసి ఎయిర్ హోస్టెస్‌కి చూపించాడు. విషయం తెలుసుకున్న ఎయిర్ హోస్టెస్ వెంటనే పైలట్‌కు సమాచారం ఇచ్చింది. పైలట్ అప్రమత్తమై వెంటనే గ్రౌండ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

తర్వాత విమానం నిలిపివేసి, సాంకేతిక సిబ్బంది గూడు చుట్టూ ఉన్న చిన్న కర్రలను జాగ్రత్తగా తొలగించారు. ఈ మొత్తం ప్రక్రియ మూడు గంటల పాటు కొనసాగింది. చివరికి సమస్యను సకాలంలో పరిష్కరించడంతో విమానం సురక్షితంగా బయలుదేరింది. ఈ ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ ఘటనతో ఎయిర్ సేఫ్టీపై ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. విమాన సర్వేలలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు విమాన ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

Read More : కులు జిల్లాలో క్లౌడ్ బరస్ట్‌తో విపరీతమైన వర్షాలు

One thought on “ముంబై ఎయిర్ ఇండియా విమానంలో పక్షి గూడు కలకలం.

Comments are closed.