అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై గుజరాత్ ఆరోగ్యశాఖ తాజా ప్రకటన విడుదల చేసింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులు, నేలపై ఉన్న 34 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.
ఇప్పటివరకు కనీసం 256 మృతదేహాలను కుటుంబాలకు అప్పగించినట్లు సమాచారం. మిగిలిన మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, బాధిత కుటుంబాలకు సహాయమందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని ప్రకటించారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
Read More : తిరువణ్ణామలైలో ఆస్తి పత్రాల హుండీ కధనంపై వివాదం

One thought on “275 మంది మృతిచెందిన ఘోర ఘటన”
Comments are closed.