హెల్తీ ఫుడ్స్ పేరుతో మోసం

ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ప్రజలు చక్కెరను తగ్గించి హెల్తీ ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. అయితే, హెల్తీగా కనిపించే కొంతమంది ఆహార పదార్థాల్లో దాగి ఉన్న అధిక చక్కెర గురించి తక్కువమంది మాత్రమే తెలుసు. వీటిని రోజూ తినడం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోజూ తినే కొన్ని సాధారణ పదార్థాల్లో దాగి ఉన్న చక్కెర ఏవంటే:

ఫ్లేవర్డ్ యోగర్ట్
పెరుగు ఆరోగ్యానికి మంచిదే కానీ అధిక రుచితో వచ్చే ఫ్లేవర్డ్ యోగర్ట్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి మీ ఫిట్‌నెస్ లక్ష్యాలకు ఆటంకం కలిగిస్తాయి. సాధారణ పెరుగు లేదా పండ్లు కలిపిన పెరుగు తినడం ఉత్తమం.

ప్యాకెట్ జ్యూస్‌లు
“100% నేచురల్” అని చెప్పే ప్యాకెట్ జ్యూస్‌లలో కూడా అధిక చక్కెర ఉంటుంది. ఇవి తాగడం వలన సగటు సోడా తాగినట్టు ప్రభావం చూపుతుంది. చక్కెర తగ్గించాలంటే పండ్లను కోసుకుని నేరుగా తినడం ఉత్తమం.

టమాటో కెచప్, సాస్‌లు
కెచప్‌లు, సాస్‌లలో రుచి కోసం చక్కెర ఎక్కువగా కలుపుతారు. ఇవి రోజూ తీసుకుంటే షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇంట్లో తయారుచేసిన సాస్‌లను ఉపయోగించటం ఉత్తమం.

తృణధాన్యాలు (సెరియల్స్)
అల్పాహారంలో తీసుకునే తృణధాన్యాల్లో చక్కెర దాగి ఉంటుంది. లేబుల్ చదవకుండా blindly తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. షుగర్ ఫ్రీ సెరియల్స్‌ను ఎంచుకోవాలి.

ఎనర్జీ, ప్రోటీన్ బార్లు
చాక్లెట్‌కు బదులుగా తినే ఎనర్జీ బార్లు, ప్రోటీన్ బార్లలో షుగర్ సిరప్ ఎక్కువగా ఉంటుంది. హెల్తీ అని భావించి తీసుకునే ఈ బార్లే ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఉపయోగించే ముందు లేబుల్ తప్పనిసరిగా చదవాలి.

మొత్తంగా చెప్పాలంటే…
హెల్తీ ఫుడ్ పేరుతో రోజూ తినే కొన్ని పదార్థాలు నిజానికి అనారోగ్యకరమైనవి కావచ్చు. కాబట్టి ఏదైనా ఫుడ్ తీసుకునే ముందు దాని పదార్థాలు, లేబుల్స్ చదివే అలవాటు చేసుకోవాలి. లేకపోతే అనుకోని ఆరోగ్య సమస్యలు ఎదురవవచ్చు.

Read More : యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి?