హెచ్‌సీయూ భూముల వివాదం కేసులో హైకోర్టు విచారణ ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. సోమవారం నాడు జరిగిన విచారణలో పలు అంశాలను న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున, హైకోర్టు తుది నిర్ణయం తీసుకోవడం అసాధ్యమని తెలిపింది డివిజన్ బెంచ్. ఈ నేపథ్యంలో కేసులో సంబంధిత కౌంటర్‌లు, స్టేటస్ రిపోర్టులను ఈ నెల 24 లోపు సమర్పించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు ఫేక్ వీడియోలు, అటవీ ప్రాంతం తగలబెట్టిన వీడియోలపై కేసులు నమోదు చేశారు. పోలీసులే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఆధారంగా కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 24కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
ఇక మరోవైపు, కంచ గచ్చిబౌలి భూములపై ఏఐ ఆధారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు నోటీసులు జారీ చేశారు. ఆయన ఏప్రిల్ 9, 10, 11 తేదీల్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు విచారణ కొనసాగుతున్నది.
Read More : హైదరాబాద్‌లో గర్భవతిపై భర్త దారుణదాడి..

One thought on “HCUభూముల వివాదంపై హైకోర్టు విచారణ వాయిదా.”
Comments are closed.