భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు–ప్రతిదాడులు తారాస్థాయికి చేరాయి. ఈ ఉద్రిక్తతల మధ్య భారత్ పాక్ నగరాలపై గట్టి బదులు ఇచ్చింది. దీంతో పాక్ కూడా జమ్మూకశ్మీర్, రాజస్థాన్ ప్రాంతాలపై దాడులకు తెగబడింది. అయితే భారత భద్రతా దళాలు ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి.
సరిహద్దుల్లో హై అలర్ట్ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌పై కూడా ప్రభావం పడింది. పంజాబ్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు క్రీడా రంగానికీ వ్యాపిస్తున్నదానికి ఇది స్పష్టం సంకేతం.
మ్యాచ్ ఆపిన సమయానికి పంజాబ్ కింగ్స్ 10.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. భద్రతా కారణాలతో మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు ప్రకటించారు.
ఈ పరిణామం ప్రస్తుత భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతల తీవ్రతను ప్రతిబింబిస్తోంది.
Read More : బ్రేకింగ్ న్యూస్ఐ – పీఎల్ మ్యాచ్‌కు ప్రభావం..
