రెవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహారశైలిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు..

తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రెవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిధిలో చెట్ల నరుకు అంశంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఒక పేద రైతు తన పొలంలో ఒక్క చెట్టు నరికి పడేసినా రెవెన్యూ అధికారులు వెళ్లి ట్రాక్టర్‌ను సీజ్ చేసి, భారీ జరిమానాలు వేస్తారు. మరి రెవంత్ రెడ్డి ప్రభుత్వం వందల ఎకరాల్లో చెట్లు నరుకుతున్నా, రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?” అని హరీష్ రావు ప్రశ్నించారు.

అంతేకాకుండా, “చెట్లను నరికడం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లడమే కాదు, అడవిలో నివసించే జంతువుల జీవన విధానాన్ని కూడా అంతరాయం కలుగుతుంది. ఈ ఘటనలో 3 జింకలు దిక్కుతెలియని పరిస్థితిలో బయటకు వచ్చి, కుక్కల దాడిలో మరణించాయి. దీన్ని ఎవరు బాధ్యత తీసుకోవాలి?” అని వ్యాఖ్యానించారు.

అలాగే, సెలవుల్లో కోర్టులు పనిచేయకపోతే ఇదే అవకాశంగా తీసుకుని చెట్లను నరికించడం, ఇండ్లను కూల్చడం ప్రభుత్వ విధానమా అని ప్రశ్నించారు. ఇటీవల హైకోర్టు హైడ్రా కేసులో సెలవులు చూసి కూల్చివేతలు చేయవద్దని హెచ్చరిక జారీ చేయడాన్ని గుర్తు చేశారు. అదే విధంగా HCUలో కూడా ఉగాది, రంజన్ సెలవుల సమయంలో చెట్లను నరికారని ఆరోపించారు.

“రాజ్యాంగం పేద రైతుకు ఒక్కటే, ముఖ్యమంత్రికి మరోకటి కాదని గుర్తుంచుకోవాలి” అని హరీష్ రావు స్పష్టం చేశారు.