ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు భారీ నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.6,700 కోట్లు రుణంగా ఆమోదం పొందిన ఈ నిధుల్లో భాగంగా, మొదటి విడతగా రూ.3,535 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. దీంతో అమరావతి నిర్మాణానికి వేగం పెరిగే అవకాశముంది.
ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం స్వంత నిధులతో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నిధుల విడుదలతో పాటు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి కూడా త్వరలోనే మొదటి విడత రుణం విడుదల కానుంది. ఏడీబీ ఇప్పటికే రూ.6,700 కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.13,600 కోట్లు ఈ రెండు బ్యాంకుల ద్వారా రాబోతోగా, అదనంగా కేంద్రం ప్రత్యేక సహాయంగా రూ.1,400 కోట్లు మంజూరు చేసింది.
ఇక హడ్కో నుండి రూ.11 కోట్ల రుణం సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందింది. అలాగే జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ ద్వారా మరో రూ.5,000 కోట్ల రుణం తీసుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
అసలుగా ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాలు గతేడాది డిసెంబర్‌లోనే ఆమోదం పొందాయి. ఈ సంవత్సరం జనవరిలోనే నిధులు విడుదల కావాల్సి ఉన్నా, అమరావతి రాజధానిగా పనికిరాదంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిర్ణయం ఆలస్యమైంది. అయితే అన్ని అడ్డంకులు అధిగమించి, ఇప్పుడు మొదటి విడత నిధులు విడుదల కావడంతో రాజధాని నిర్మాణ పనులు మరింత వేగంగా సాగనున్నాయి.
Read More : జగన్ సమావేశంలో వైసీపీ కార్యకర్తల కొనియాడింపు, టీడీపీ పై విమర్శలు..

One thought on “ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు భారీ నిధుల మంజూరు…”
Comments are closed.