గుజరాత్ టైటాన్స్ జెర్సీలో మెరిసిన మహ్మద్ సిరాజ్…

ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఏడేళ్లు గడిపిన మహ్మద్ సిరాజ్, ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో తన తొమ్మిదో సీజన్ ఆడుతున్న సిరాజ్, ఇప్పటివరకు 95 మ్యాచ్‌ల్లో 87 matchs బెంగళూరు ఫ్రాంచైజీ తరఫునే ఆడాడు. ఎంఛిన్నాస్వామి స్టేడియం గతంలో అతని హోం గ్రౌండ్ కాగా, బుధవారం అదే మైదానంలో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతూ 3/19 అద్భుత గణాంకాలతో రాణించాడు.

ఇక సీజన్‌లో రెండు విజయాలతో స్వదేశీ మైదానంలో అడుగుపెట్టిన ఆతిథ్య RCB, తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భారీ స్కోర్ అందుకునే అవకాశం ఉన్నా, గుజరాత్ టైటాన్స్ పేసర్ల మెరుపు దాడికి టాప్-ఆర్డర్ కుప్పకూలింది. లెంగ్త్, వేరియేషన్ల ఆధారంగా బౌలర్లు రాణించడంతో RCB ఆటగాళ్లు ఒత్తిడికి లోనయ్యారు.

Read More : SRH vs HCA వివాదానికి ముగింపు: 3,900 ఫ్రీ పాస్‌ల కేటాయింపుతో కాంట్రవర్సీ పరిష్కారం…

One thought on “గుజరాత్ టైటాన్స్ జెర్సీలో మెరిసిన మహ్మద్ సిరాజ్…

Comments are closed.