14 దేశాలకు సౌదీ అరేబియా వీసాలపై తాత్కాలిక నిషేధం.

మక్కాలో పవిత్ర హజ్ యాత్ర సమీపిస్తున్న నేపథ్యంలో, సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ సహా 14 దేశాల పౌరులకు ఉమ్రా, బిజినెస్ మరియు ఫ్యామిలీ విజిట్ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిషేధం జూన్ మధ్యం వరకు కొనసాగనుంది, హజ్ ముగింపు నాటికి తిరిగి సాధారణ పరిస్థితులు కనిపించొచ్చని అంచనా.

ఈ నిషేధానికి గురైన దేశాలు: భారతదేశం, పాకిస్తాన్, బాంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేసియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్, ఈథియోపియా, ట్యూనీషియా, యెమెన్, మొరొక్కో.

ఇది ముందస్తు చర్యగా తీసుకున్నదని సౌదీ అధికారులు తెలిపారు. హజ్‌కు సంబంధించి అధికారిక అనుమతులేమి లేకుండా, ఉమ్రా లేదా ఇతర వీసాలపై వచ్చి దుర్వినియోగం చేయడాన్ని నిరోధించేందుకే ఈ నిషేధం అమల్లోకి వచ్చిందని వివరించారు.

అయితే ఏప్రిల్ 13 వరకు ఉమ్రా వీసా ఉన్నవారు సౌదీ అరేబియాలోకి ప్రవేశించవచ్చని స్పష్టం చేశారు. గతంలో కొంతమంది విదేశీయులు ఉమ్రా లేదా టూరిస్ట్ వీసాలపై వచ్చి హజ్‌లో పాల్గొనే ప్రయత్నం చేసి, అనధికారికంగా అక్కడ ఉండిపోయారు. దీని ఫలితంగా తీవ్ర జనం గుమిగూడటం, వేడి ప్రభావం వల్ల సమస్యలు తలెత్తాయి.

2024 హజ్ సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 1,200 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో భద్రతా దృష్ట్యా ఈసారి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.

Read More : ఢిల్లీ వేదికగా ట్రావిస్ స్కాట్ తొలి భారత టూర్..

One thought on “14 దేశాలకు సౌదీ అరేబియా వీసాలపై తాత్కాలిక నిషేధం.

Comments are closed.