లక్షల జీతాన్ని వదిలేసి.. కెమెరా ముందు నిలిచిన అషు!

Ashu Reddy Tollywood journey

టిక్ టాక్, రీల్స్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా పాపులర్ అయిన యువతిలో అషు రెడ్డి ఒకరు. విశాఖపట్నం వాసిగా ఉన్న అషు, అమెరికాలో HR మేనేజ్‌మెంట్‌లో MBA పూర్తి చేసి, అక్కడే లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం చేసేది. అయితే నటనపై ఉన్న ఆసక్తితో, టిక్‌టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించి, సినీ రంగంపై దృష్టి పెట్టింది. ఇదే సమయంలో ఆమెకు సినీ అవకాశాలు లభించాయి.

అమెరికాలో ఉన్న సమయంలోనే అషు రెడ్డి, పవన్ కళ్యాణ్ నిర్మాతగా, నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహన్ రంగ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాకు అమెరికాలో షూటింగ్ జరగడంతో, అక్కడే ఓ హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్‌గా కనిపించింది. ఈ సినిమా 2018లో విడుదల కాగా, అదే సమయంలో నటనపై మరింత ఆసక్తి పెరిగింది. ఉద్యోగాన్ని వీడి, ఇండియాకు తిరిగొచ్చి నటనను కెరీర్‌గా ఎంచుకుంది.

2019లో బిగ్ బాస్ షోలో పాల్గొన్న అషు రెడ్డికి అక్కడి నుంచే తెలుగువారిలో పెద్దగా గుర్తింపు వచ్చింది. ప్రస్తుతానికి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా రీల్స్ చేస్తూ, పలు బుల్లితెర రియాల్టీ షోల్లో పాల్గొంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. అమెరికాలో ఉద్యోగం మానేసి సినిమాలు, టీవీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవడంలో అషు దూకుడే ప్రధాన కారణం.

Read More

One thought on “లక్షల జీతాన్ని వదిలేసి.. కెమెరా ముందు నిలిచిన అషు!

Comments are closed.