అమెరికన్ సింగర్, రాపర్ ట్రావిస్ స్కాట్ భారతదేశంలో తొలిసారిగా తన కన్సర్ట్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘సర్కస్ మాక్సిమస్ వరల్డ్ టూర్ 2025’ భాగంగా అక్టోబర్ 18న ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ భారీ సంగీత వేడుక జరగనుంది.
ఈ టూర్ ప్రకటనతో ట్రావిస్ అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. టిక్కెట్ల కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్న సమయంలో, ఈవెంట్ నిర్వాహకులు తాజాగా టికెట్ వివరాలను వెల్లడించారు.
ట్రావిస్ స్కాట్ షో టిక్కెట్లు 2025 ఏప్రిల్ 5న మధ్యాహ్నం 12 గంటలకు BookMyShow వేదికగా అమ్మకానికి సిద్ధంగా ఉండనున్నాయి. అయితే, టిక్కెట్లు పొందేందుకు ఒక వర్చువల్ క్యూ సిస్టమ్‌ను ఉపయోగించనున్నారు. ఇందులో అభిమానికి ఓ ర్యాండమ్ క్యూ పొజిషన్ అప్పగించబడుతుంది.
ఈ గ్రాండ్ షోను BookMyShow Live నిర్వహిస్తోంది.
Read More : స్క్విడ్ గేమ్ నటుడు ఓ యోంగ్ సు లైంగిక వేధింపుల కారణంగా జైలు శిక్ష

One thought on “ఢిల్లీ వేదికగా ట్రావిస్ స్కాట్ తొలి భారత టూర్..”
Comments are closed.