బాలయ్య డబుల్ డోస్.. అఖండ 2 నుంచి మాస్ అప్డేట్!

Akhanda 2 Balakrishna update

బాలకృష్ణ కెరీర్‌లో అఖండ సినిమా మైలురాయిగా నిలిచింది. కరోనా ముందు వరుస పరాజయాలతో ఇబ్బంది పడిన బాలయ్య, అఖండతో ఒక్కసారిగా జోష్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో వరుసగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరారు. ప్రస్తుతం ఆయన ఆ సక్సెస్ ఫార్ములాను కొనసాగిస్తూ, అఖండ 2 సినిమాతో మరోసారి భారీ హిట్ అందుకోవడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. మొదటి భాగాన్ని మించిన పవర్‌ఫుల్ కాన్సెప్ట్‌తో అఖండ 2 రూపొందుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఒక పాత్రలో సాధారణ లుక్‌లో కనిపించనున్న ఆయన, మరొక పాత్రలో అఘోరా గెటప్‌లో అదిరిపోయే మాస్ అప్పీల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇక తాజా సమాచారం ప్రకారం, ఈసారి కథలో ఫ్యామిలీ ఎమోషన్‌కు ఎక్కువ స్థానం దక్కనుందట. శివ తత్వం, ఆలయాల పరిరక్షణ వంటి అంశాలతో పాటు మరిన్ని కమర్షియల్ హైలైట్స్‌ను బోయపాటి స్క్రీన్‌పై చూపించనున్నాడని తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. అఖండ 2 ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More

One thought on “బాలయ్య డబుల్ డోస్.. అఖండ 2 నుంచి మాస్ అప్డేట్!

Comments are closed.