సినిమా కథను తలపించేలా గుజరాత్ రాష్ట్రం దేవ్‌భూమి ద్వారకా జిల్లాలోని జఖోత్రా గ్రామంలో ఓ హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. ఒక వివాహిత తన ప్రేమికుడితో పారిపోవడానికి ఒక అమాయకుడిని దారుణంగా హత్య చేసి, అతనిపై కాల్పులు జరిపి, అతను చనిపోయాడని నమ్మించడానికి ప్రయత్నించింది. ఈ సంఘటన “దృశ్యం” సినిమాకు జీవం పోసినట్టే అయ్యింది.
వివరాల్లోకి వెళితే… స్థానికంగా నివసిస్తున్న గీతా అహిర్ (22) అనే వివాహితకు భరత్ అనే 21 ఏళ్ల యువకుడితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తన భర్తను వదిలి భరత్‌తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆమె నిర్ణయించుకుంది. అయితే ఇంటి నుంచి పారిపోవాలంటే తమ ఆత్మహత్యగా నమ్మించేలా నకిలీ షరతులు సృష్టించాలనే మాయా పథకాన్ని రచించారు.
ఈ నేపథ్యంలో వారు రోడ్డుపై వెళ్తున్న 56 ఏళ్ల హర్జీభాయ్ సోలంకీ అనే నిరుపరాధ వ్యక్తిని అమానుషంగా హత్య చేసి, అతడి మృతదేహానికి గీతా వాడే దుస్తులు, పట్టీలు తగిలించి, తగలబెట్టి పారిపోయారు. కాలిన శవాన్ని చూసిన గీతా భర్త, అది తన భార్యదేనని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
అయితే, శవాన్ని పరిశీలించిన పోలీసులు అది పురుషుడిదని గుర్తించారు. శవ DNA టెస్ట్‌లు, ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు అసలు నిజాన్ని వెలికితీశారు. గీతా, భరత్ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని హత్య కేసు నమోదు చేశారు.
ఈ ఘటన గ్రామ ప్రజల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఇలాంటి కుట్ర పథకాలతో అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు నేరజగతంలో కొత్త మలుపులకు కారణమవుతున్నాయని పోలీసు వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
“ఇది ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా జరిగిన అమానుష నేరం. మేము దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి వారిని శిక్షించడానికి చర్యలు తీసుకుంటాము” అని పోలీసు అధికారి అన్నారు.
Read More : లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నవీన్‌కుమార్ మృతి.

One thought on “వివాహిత ప్రేమికుడితో పారిపోవడానికి అమాయకుడి హత్య.”
Comments are closed.