ఆర్టీసీ బస్సు ఆపలేదనే ఆగ్రహంతో ఒక మహిళ బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న బస్సును సర్పాల మండలం నడిమివంక గ్రామం వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న ఒక మహిళ ఆపింది. అయితే, డ్రైవర్ బస్సు ఆపకుండా ముందుకు వెళ్ళిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ మహిళ, తన ద్విచక్ర వాహనంపై బస్సును వెంబడించి ఓవర్‌టేక్ చేసి బస్సును నిలిపివేసింది.
బస్సు ఎందుకు ఆపలేదని డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగిన ఆమె, ఆగ్రహంతో డ్రైవర్ చెంప పగలగొట్టింది. ఈ ఘటనతో ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More : సినిమాటోగ్రఫీ మంత్రిని కలవనున్న నిర్మాతలు
