ఆసియా కప్‌లో మరోసారి భారత్–పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్ రానుంది. సెప్టెంబర్ 14న దుబాయ్ స్టేడియంలో ఈ పోరుకు వేదిక సిద్ధమైంది. ఇప్పటికే అభిమానుల్లో ఉత్కంఠ పీక్స్‌కు చేరుకుంది.
మరోవైపు, భారత్‌లో ఆసియా కప్ లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌ల ప్రచారం కోసం యాడ్ రేట్ కార్డును సంస్థ విడుదల చేసింది. అందులో భాగంగా, ఒక్క 10 సెకన్ల టీవీ యాడ్ ధరను రూ.16 లక్షలుగా నిర్ణయించడంతో చర్చనీయాంశమైంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం ప్రకటించిన ప్యాకేజీలు ఇలా ఉన్నాయి:
టీవీ యాడ్ ప్యాకేజీలు
- కో-ప్రెజెంటింగ్ పార్ట్‌నర్‌షిప్: రూ.18 కోట్లు
- అసోసియేట్ పార్ట్‌నర్‌షిప్: రూ.13 కోట్లు
- స్పాట్ బై ప్యాకేజీ: 10 సెకన్లకు రూ.16 లక్షలు లేదా 4.48 కోట్లు
సోనీ లైవ్ డిజిటల్ డీల్స్
- కో-ప్రెజెంటింగ్ & హైలైట్స్ పార్ట్‌నర్: రూ.30 కోట్లు
- కో-పవర్డ్ బై ప్యాకేజీ: రూ.18 కోట్లు
ఫార్మాట్ వారీగా యాడ్ రేట్లు
- ప్రీ రోల్స్: 10 సెకన్లకు రూ.275 (భారత్ మ్యాచ్‌లకు రూ.500, భారత్–పాక్ మ్యాచ్‌లకు రూ.750)
- మిడ్ రోల్స్: రూ.225 (భారత్ మ్యాచ్‌లకు రూ.400, భారత్–పాక్ మ్యాచ్‌లకు రూ.700)
- కనెక్టెడ్ టీవీ యాడ్స్: రూ.450 (భారత్ మ్యాచ్‌లకు రూ.800, భారత్–పాక్ మ్యాచ్‌లకు రూ.1200)
ఇక మొత్తం ఆసియా కప్ టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరుగనుంది. దుబాయ్, అబుదాబీ వేదికలపై 8 జట్లు 19 టీ20 మ్యాచ్‌లలో తలపడతాయి. ఇందులో భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమాన్ గ్రూప్–Aలో, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు గ్రూప్–Bలో పోటీపడనున్నాయి.
Read More : 2030 కామన్వెల్త్ ఆతిథ్యం కోసం భారత్‌కు ఐఓఏ గ్రీన్ సిగ్నల్

One thought on “IND vs PAK మ్యాచ్ : యాడ్ రేట్లు రికార్డ్ స్థాయిలో”
Comments are closed.