శ్రీకాకుళం జిల్లాలో GBS Virus కలకలం – పదేళ్ల బాలుడి మృతి
Srikakulam జిల్లా, సంతబొమ్మాళి (Santhabommali) మండలం కాపుగోదాయ వలస (Kapugodaya Valasa) గ్రామంలో గులియన్ బారీ సిండ్రోమ్ (Guillain-Barré Syndrome – GBS Virus) కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు వాతాడ యువంత్ (Vatada Yuvanath) ఈ వ్యాధితో మరణించాడని ప్రచారం జరుగుతుండడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
GBS Virus మహారాష్ట్ర (Maharashtra)లో ప్రబలగా, ఇటీవల తెలంగాణ (Telangana)లో కూడా కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో యువంత్ మరణానికి GBS Virus కారణమా? అనే అనుమానంతో జిల్లా వైద్యాధికారులు (District Medical and Health Officer – DMHO) బాలమురళీకృష్ణ (Balamuralikrishna) నేతృత్వంలో వైద్య బృందం గ్రామాన్ని సందర్శించింది.
Medical tests & reports
✅ యువంత్ కుటుంబ సభ్యులతో చర్చ
✅ బాలుడికి నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలు పరిశీలన
✅ ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు
✅ గ్రామంలో జ్వరం, గొంతు నొప్పి ఉన్నవారి వివరాల సేకరణ
✅ పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు
డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ ప్రకారం, GBS Virus మూడులక్షల మందిలో ఒకరికి మాత్రమే సోకే అరుదైన వ్యాధి. ఇది అంటువ్యాధి (Infectious Disease) కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గ్రామంలో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.
Our you tube channel click here
