యూకేలోని యార్క్‌షైర్ ప్రాంతంలో గొర్రెలకు బర్డ్ ఫ్లూ (Bird Flu) సోకిన తొలి కేసు నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వ్యాధి పక్షులు, పందులు, ఇతర కొన్ని జంతువులలోనే గుర్తించబడింది. అయితే, ఇప్పుడు గొర్రెలలో కూడా బర్డ్ ఫ్లూ వైరస్(H5N1) సోకినట్టు వైద్య నిపుణులు ధృవీకరించారు.
సంబంధిత అధికారుల ప్రకారం, బర్డ్ ఫ్లూ సోకిన గొర్రెను వెంటనే కాల్చివేశారు. అదనపు పరీక్షలు నిర్వహించినప్పటికీ, ఇప్పటివరకు మరో గొర్రెలకు ఈ వ్యాధి సోకిన నిర్ధారణ కాలేదు. అయితే, వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు యార్క్‌షైర్‌లో కఠినమైన బయోసెక్యూరిటీ చర్యలు అమలు చేస్తున్నారు.
పశువైద్య నిపుణులు, ప్రభుత్వం కలిసికట్టుగా వ్యవహరిస్తూ, వైరస్ నియంత్రణకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. యూకే వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం, ప్రజలు, పశువుల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లక్షణాలు గల జంతువులను తక్షణమే సమాచారం అందించాలని సూచించారు. \
Read More : అమెరికా నుండి అత్యధిక H1B వీసా అనుమతులు పొందిన భారతీయ కంపెనీలు!

One thought on “యార్క్‌షైర్‌లో ప్రపంచంలోనే తొలిసారి గొర్రెలకు బర్డ్ ఫ్లూ కేసు నమోదు”
Comments are closed.