ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెంలో దారుణం జరిగింది. కన్న కొడుకే ఆస్తి కోసం కన్నతల్లిని నడిరోడ్డుపై వేటకొడవలితో నరికిన ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది.
వివరాలు:
కొయ్యలగూడెంకు చెందిన శివ, తన తల్లి లక్ష్మీనరసమ్మను కొంతకాలంగా ఒకే ఒక్క ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నాడు. ఆదివారం మళ్లీ ఇదే విషయమై తల్లితో గొడవపడిన శివ, మద్యం మత్తులో ఆవేశానికి లోనై వేటకొడవలితో ఆమెపై దాడి చేశాడు. నడిరోడ్డుపై జరిగిన ఈ దాడిలో లక్ష్మీనరసమ్మ తీవ్రంగా గాయపడింది.
స్థానికులు వెంటనే ఆమెను కాకినాడలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి శివను అదుపులోకి తీసుకున్నారు.
Read More : రాఖీ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

One thought on “కన్నతల్లిని నడిరోడ్డుపై నరికిన కొడుకు”
Comments are closed.