భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ ప్రారంభమైందని, తనే మొట్టమొదటిగా దీని బాధితుడిగా మారానని పేర్కొన్నారు. అప్పట్లో డీజీపీకి అనేక మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన రఘునందన్ రావు… ఫోన్ ట్యాపింగ్ ఘటనపై అసలు బాధితులను పక్కన పెట్టి అసంబద్ధమైన కాంగ్రెస్ నేతలను విచారణకు పిలుస్తున్నారని ఆరోపించారు. రోజుకు ఒక్కరినే విచారణకు పిలవడాన్ని ‘డైలీ సీరియల్’తో పోల్చారు. తమ వద్ద ఆధారాలన్నీ ఉన్నాయని, ఎవరైనా అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
అలాగే, కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేస్తూ.. గత 18 నెలల్లో ఒక్కసారి కూడా సమీక్షించుకోలేదని, ప్రతీ రోజూ కొత్త కథలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ ప్రకటించిన ‘ఇందిరమ్మ క్యాంటీన్’పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల పేర్లను మార్చడం కన్నా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇందిరమ్మ ఇళ్లను నిజంగా అవసరమున్నవారికి కాకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయించారని ఆరోపించారు. బీసీ హక్కుల విషయంలో కూడా కాంగ్రెస్ సరిగా వ్యవహరించడం లేదని, కవిత బీసీ కాదని ప్రశ్నించారు. బీసీలకు కీలక పదవులు ఇవ్వకుండా ఉద్యమాలపై మాటలు చెబుతుండటం వైఖరిగా అభివర్ణించారు.
ఈ విధంగా ట్యాపింగ్ కేసుపై దృష్టిని మళ్లిస్తూ అసలు బాధితులను పక్కన పెడుతున్నారని మండిపడ్డ రఘునందన్ రావు, తమకు న్యాయం జరగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Read More : లైవ్ స్ట్రీమింగ్ శృంగార రాకెట్: దంపతుల అరెస్ట్

One thought on “దుబ్బాక ఉపఎన్నికలోనే ఫోన్ ట్యాపింగ్ మొదలైంది”
Comments are closed.