సీఎం కాన్వాయ్‌కి బ్రేక్‌.. కల్తీ డీజిల్‌తో 19 వాహనాలు నిలిచిపోయాయి

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో అనూహ్యంగా ఆటంకం తలెత్తింది. సీఎం కాన్వాయ్‌లోని 19 వాహనాలు ఒకేసారి మధ్యలోనే ఆగిపోవడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. వాహనాలు మొరాయించడంతో ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు.

తద్వారా వెంటనే దర్యాప్తు చేపట్టి వాహనాల్లో నింపిన డీజిల్‌ను పరిశీలించగా.. అందులో నీళ్లు కలిపినట్లుగా గుర్తించారు. ఈ కల్తీ డీజిల్‌ స్థానిక పెట్రోల్‌ బంక్‌ నుంచే వచ్చిందని అధికారులు నిర్ధారించారు.
పెట్రోల్‌ బంక్‌ నుంచి డీజిల్ నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించగా నీటి మిశ్రమం ఉన్నట్లు తేలింది. దీనిపై సంబంధిత పెట్రోల్‌ బంక్‌పై అధికారులు చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ఘటన సీఎం భద్రత విషయంలో సీరియస్‌గా తీసుకుంటూ, భద్రతా వ్యవస్థలో తగిన మార్పులు చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు.

Read More : Tata Group : రూ.500 కోట్ల ట్రస్ట్ ఏర్పాటు

One thought on “సీఎం కాన్వాయ్‌కి బ్రేక్‌.. కల్తీ డీజిల్‌తో 19 వాహనాలు నిలిచిపోయాయి

Comments are closed.