నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట గ్రామంలో చిరుత పులి సంచారం గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు ఈ చిరుత గ్రామంలోకి ప్రవేశించి ప్రజలను గజగజలాడిస్తోంది. అర్ధరాత్రి సమయంలో ఇళ్ల మధ్య తిరుగుతూ సీసీ కెమెరాల్లో చిక్కింది. పశువుల మీద దాడి చేస్తుందేమోనన్న భయం, పిల్లల భద్రతపై ఆందోళన గ్రామస్థుల్లో గట్టిగా వ్యక్తమవుతోంది.
తాజాగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చిరుత పులి ఒక ఇంటి దగ్గర కనిపించింది. ఇంటి ముందు ఉంచిన మేకల వాసన చూసుకుంటూ తిరిగిన వీడియో బయటకు వచ్చింది. వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే చిరుత అప్పటికే అటవీ ప్రాంతంగా భావిస్తున్న పక్కటి చెట్ల పొదల్లోకి తిరిగి వెళ్లిపోయింది.
Read More : జగిత్యాల జిల్లాలో కూతురు వృద్ధ తల్లిని అడవిలో

One thought on “దోమలపెంట గ్రామంలో వారం రోజుల్లో మూడుసార్లు దర్శనమిచ్చిన చిరుత”
Comments are closed.