విశాఖపట్నం జిల్లా, పెదబయలు మండలం, ఇంజరి పంచాయతీ పరిధిలోని జాలంపల్లి గ్రామంలో సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో మరోసారి మానవత్వం మంటగలిసింది. గ్రామానికి చెందిన ఓ మృతదేహాన్ని బంధువులు, గ్రామస్థులు డోలీలో మోసుకెళ్లాల్సి వచ్చింది. మన్యంలో రహదారి సౌకర్యాల లేమికి ఇది నిదర్శనమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామానికి కనీసం శ్మశాన వాటికకు వెళ్లే దారి కూడా లేకపోవడంతో, మృతుడి కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడింది. వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
read More : తిరుమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం

One thought on “రోడ్డు లేక మృతదేహం తరలింపు”
Comments are closed.