హీరోయిన్ దివ్య భారతి – బాడీ షేమింగ్ నుంచి స్టార్ డమ్ వరకు!

హీరోయిన్ దివ్య భారతి – బాడీ షేమింగ్ నుంచి స్టార్ డమ్ వరకు!

కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. ఆ విమర్శలతో తన ఆత్మవిశ్వాసం కోల్పోయి, ఎదుటి వాళ్ల ముందు నడవడానికి కూడా ఇబ్బంది పడ్డానని చెప్పింది. తాను అందంగా లేనట్టుగా అనిపించడంతో జనాల ముందుకు రావడానికి భయపడేదట. కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక్క పోస్ట్‌ ఆమె జీవితాన్ని మార్చేసిందట!

దివ్య భారతి! తమిళ, తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం దూసుకెళ్తున్న ఈ బ్యూటీ గురించి తెలియని వారుండరు. కాలేజీ రోజుల్లో తనపై వచ్చిన కామెంట్ల కారణంగా కొంత కాలం ఇబ్బంది పడ్డా, చివరికి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

హీరో జీవీ ప్రకాశ్‌తో కలిసి తన తొలి సినిమాలో నటించింది. సినిమాలోని రొమాంటిక్ సీన్లతో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇక సోషల్ మీడియాలోనూ ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. సుడిగాలి సుధీర్ సరసన ‘గాలోడు’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read More

One thought on “హీరోయిన్ దివ్య భారతి – బాడీ షేమింగ్ నుంచి స్టార్ డమ్ వరకు!

Comments are closed.